Preloader

(జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ ): హైదరాబాద్‌లోని  ఎం.సి.ఆర్. మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 30, 31 తేదీలలో నిర్వహించనున్న జాతీయ సదస్సులో కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన రాజనీతి శాస్త్ర అధ్యాపకులు  సంకినేని వెంకటయ్య పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు.“ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి, ప్రజా విధానం” అనే ప్రధాన అంశంపై జరిగే ఈ సదస్సులో “గ్రామీణాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన” అంశంపై ఆయన పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థల పాత్ర, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక అసమానతల తగ్గింపు, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిర అభివృద్ధి సాధన వంటి అంశాలను ఈ పరిశోధనలో విశ్లేషించనున్నారు.సంకినేని వెంకటయ్య ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమెన్స్ పీజీ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కాకతీయ విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర విభాగాధిపతిగా సేవలందించారు.

Share this news as a Photo Card

29 October 2026

జాతీయ సదస్సులో పరిశోధనా పత్రం సమర్పించనున్న  సంకినేని వెంకటయ్య

www.jaibharatvoice.com