Preloader
Reporter:K.Ashok

(జై భారత్ వాయిస్, ఆత్మకూరు );
సైబర్ నేరాల నివారణలో భాగంగా ఆత్మకూర్ పోలీసులు గురువారం మండల కేంద్రంలో “ఫ్లాష్ వాక్” అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ *బాబులాల్* ఆధ్వర్యంలో “ఆగండి – ఆలోచించండి – అడుగువేయండి” అనే నినాదంతో గ్రామ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ బాబులాల్ మాట్లాడుతూ. .గుర్తు తెలియని వ్యక్తులకు OTP, బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దు అన్నారు. అనుమానాస్పద లింక్ లను క్లిక్ చేయవద్దని ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని అన్నారు.
చట్టంలో”డిజిటల్ అరెస్ట్” అనేదే లేదు, ఆ పేరుతో ఎవరైనా బెదిరిస్తే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని అన్నారు.
సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేయాలని ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది గ్రామస్థులతో పాటు ఎస్ఐ లక్ష్మీనారాయణ, హెడ్ కానిస్టేబుళ్లు కుమారస్వామి, నర్సింగరావు, కానిస్టేబుళ్లు కరణ్, శ్రీనివాస్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share this news as a Photo Card

30 October 2026

సైబర్ నేరాలపై ఆత్మకూర్ పోలీసుల ఫ్లాష్ వాక్ - "ఆగండి, ఆలోచించండి, అడుగువేయండి"

www.jaibharatvoice.com