Reporter : K.Ashok
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
రైతుల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పెంచికలపేట పిఎసిఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి హాజరై మాట్లాడారుఆత్మకూరు మండలం పెంచికలపేట పిఎసిఎస్ చైర్మన్ ఎగితే లింగయ్య పాటు పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్‌తో పాటు కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ…రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు కీలక వేదికలని, వాటిని మరింత బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం నూతన కార్యవర్గం ప్రధాన బాధ్యతగా భావించాలని సూచించారు. రైతు కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసేలా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.వ్యవసాయ రైతుల కుటుంబాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా సొసైటీలను బలోపేతం చేస్తున్నామన్నారు. క్లస్టర్ వారిగా ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తామని,కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను రైతులు అందిపుచ్చుకోవాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని సూచించారు.రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ సేవలు సకాలంలో అందించడంలో పీఏసీఎస్ సొసైటీల బాధ్యత ఎంతో ముఖ్యమైనదని అన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌గా ఎగితే లింగయ్య డైరెక్టర్లు మన్నే రాజమౌళి, పులి చేరు పూలయ్య ,కోడెపాక కుమారస్వామి ,నీల సుభాషు, పిట్టల రమాదేవి, పొనుగోటి శ్రీనివాసు, లక్కారుసు లింగమూర్తి, ఎర్ర శివా రెడ్డి, రవీందర్ రెడ్డి ,ఉప్పరి సునీత ,లక్కరుసు రజిత, ఆరిశం సూరమ్మ ,నీరుకుల్ల సర్పంచ్ తడక నీరజ ,పెంచికలపేట సర్పంచ్ మందపల్లి మరియా , సి ఓ ఓదెల లక్ష్మయ్య, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి జిల్లా కార్యదర్శి కమలాపురం రమేష్ ,పెంచికల్‌పేట ఉప సర్పంచ్ చిట్టె రవి, నీరుకుల్ల గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆర్షం కుమారస్వామి, పెంచికల్‌పేట గ్రామ కమిటీ అధ్యక్షుడు మంగరాజు ,మండలం సోషల్ మీడియా కన్వీనర్ ఉడుత రాజేందర్, తదితరులు పాల్గొన్నారు

