Preloader
Reporter:A.Ashok

(జై భారత్ వాయిస్, ఆత్మకూరు )

రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని పాటించి అధిక దిగుబడులు సాధించి, సొసైటీల ద్వారా పసుపు, మిర్చి లాంటి ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు.నూతనంగా  ఎన్నికైన చైర్ పర్సన్ నాగేల్లి స్వప్న – ఆంధ్రయ్య తో పాటు పాలకమండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నూతన కార్యవర్గ సభ్యులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి” అని సూచించారు.
పాలకమండలి సభ్యులుడైరెక్టర్లు  కంచె రవికుమార్, వెలిది వెంకటేశ్వర్లు, మంతూర్తి రవి, కాడబోయిన రవి యాదవ్, ఆలువాల రవి, పులిచేరు విజయకుమార్, బలభద్ర కృష్ణ కిషోర్, పోరెడ్డి ప్రసూన, బూర సంతోష, పరికి లక్ష్మయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి – రాజు, సీఈఓ ఓం రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు, జిల్లా కార్యదర్శి కమలాపురం రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్, కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జైపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు జిన్నా వెంకన్న, అక్కంపేట సర్పంచ్ ముద్ధం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

–

Share this news as a Photo Card

30 October 2026

ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి సొసైటీలు ఎదగాలి - ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

www.jaibharatvoice.com