Preloader

Reporter : K.Ashok
( జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):
అతని వృత్తి సెల్ ఫోన్ రిపేరింగ్ తర్వాత ప్రవృత్తి ఫోక్ సింగర్ గా రాణిస్తున్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో సెల్ ఫోన్ రిపేరర్ గా ఉంటూనే తనకు దొరికిన సమయాల్లో మంచి మంచి పాటలు పాడుతూ యూట్యూబ్ లో జానపద గాయకుడిగా రాణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మిద్దె పాక మధు ఆత్మకూరులో సెల్ ఫోన్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. ఇతని స్వస్థలం హనుమ కొండ జిల్లా శాయంపేట మండలం మాందారి పేట గ్రామం. కాని 15 ఏళ్లుగా సెల్ ఫోన్ రిపేరింగ్ వృత్తి ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నాడు .మళ్లీ తనకు దొరికిన తీరిక సమయాలలో పాటలు పాడుతూ రికార్డింగ్ లు నిర్వహిస్తూ వీడియోలు చేయడంలో తల మునకలు అవుతున్నాడు. ఈ విషయాల వివరాల్లోకి వస్తే మిద్దపాక మధు మాట్లాడుతూ తాను సెల్ ఫోన్ లను రిపేరింగ్ చేస్తూనే తనకు వచ్చిన ఆదాయంతో పాటలు పాడి యూట్యూబ్ లోని పాటలు వీడియోలు పంపిస్తున్నారు.వాటి యూట్యూబ్లో రాణిస్తున్నానని చెప్పారు.

తనకున్న కొద్దిపాటి ఆదాయంతో పాటలు వీడియోలు గా జానపద గేయాలు బతుకమ్మ పాటలు ,జలపాతాల పాటలు, పాడా నని అన్నారు. మొదట బోగత జలపాతం లో పైన పాటను పాడానని ఆయన చెప్పారు.మిద్దె పాక మధురాసిన పాటలలో ముఖ్యమైనవి 2025 సంవత్సరంలో బతుకమ్మ పండుగపై ‘మహారాణి బతుకమ్మ ‘అలాగే ,2026 బతుకమ్మ పండుగ సందర్భంగా బంగారు బతుకమ్మ అంటూ పాటలు పాడి వీడియో సాంగ్ చేశారు. అంతకుముందు రాఖీ పండుగ సందర్భంగా ‘రక్త బంధాన్ని కలిపిన రాఖీ, పాట అను వీడియో సాంగ్ పాడారు. ఇంకా రైతుల కోసం రైతుల పండించే పత్తి పంటపై ‘లోకానికి నీవే ఆధారం పత్తి పువ్వమ్మ’ అంటూ పాటను పాడి అందరిని అలరించారు. కాగా నింగిలో వెలిసింది ఒక తార అనే పాట వీడియో సాంగును చేశారు ఇంకా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో
యుద్ధం రమ్మని పిలిచే అనే పాట పాడి ఉత్సాహపరిచారు. సెల్ ఫోన్ రిపేరింగ్ ద్వారా వచ్చిన కొద్దిపాటి ఆదాయాన్ని వీడియో సాంగ్ చిత్రీకరణకు ఖర్చు చేస్తున్నానని ఆయన చెప్పారు. యూట్యూబు లో కి జానపద గేయాలు పాడుతున్న మధుకు మాట్లాడుతూ సినిమాకు అవకాశం వస్తే మరింత రానిస్తానని అన్నారు గత 15 ఏళ్లుగా పాటలను విడిచిపెట్టలేదని సమయం దొరికినప్పుడల్లా పాటలను పాడుతూ ఉంటానని ఆయన వివరించారు. తనకు ఎవరైనా ప్రోత్సాహం అందించి అవకాశమిస్తే మరింత రాణిస్తానని ఆయన చెప్పారు

Share this news as a Photo Card

29 October 2026

వృత్తి సెల్ ఫోన్ రిపేరర్... ప్రవృత్తి ఫోక్ సింగర్ -యూట్యూబ్ లో సింగర్ గా రాణిస్తున్న మధు

www.jaibharatvoice.com