Preloader
Reporter: K.Aßhok

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
గ్రామాల్లో పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ చందుపట్ల రాజిరెడ్డి అన్నారు.ఆత్మకూరు మండలంలోని గ్రామాలలో మండల శాఖ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి ఆధ్వర్యం లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ చందుపట్ల రాజిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రాముఖ్యతను వివరించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, విద్యావంతులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.అర్హత కలిగిన పట్టభద్రులు అవసరమైన ధ్రువపత్రాలతో ఓటరు నమోదు చేసుకోవాలని, గ్రామంలోని ప్రతి అర్హుడికి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రేవూరి జలంధర్ రెడ్డి, బిఎల్ ఓ లు రేవూరి జైపాల్ రెడ్డి, ఎలగొండ మొగిలి, దురిశెట్టి శ్రవణ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎలగొండ లింగమూర్తి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

29 October 2026

గ్రామాల్లో పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

www.jaibharatvoice.com