Preloader
Reporter: K.Ashok

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఆత్మకూరు సి ఐ బాబు లాల్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకొని, దేశ ప్రజల భద్రత కోసం వారు చేసిన సేవలను కొనియాడారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చిరస్మరణీయమని సి ఐ బాబు లాల్ పేర్కొన్నారు. ఈ ర్యాలీ లో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జైపాల్ రెడ్డి,వెలిదే వెంకటేశ్వర్లు ,టి ఆర్ ఎస్ నాయకులు వంగాల భగవాన్ రెడ్డి, ఏ విశ్వేశ్వర రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు

Share this news as a Photo Card

27 October 2026

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా క్యాండిల్ ర్యాలీ

www.jaibharatvoice.com