(జై భారత్ వాయిస్, న్యూస్ ఆత్మకూరు)
పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పని యువత చేయాలని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ పిలుపు నిచ్చారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ళ, పెంచికలపేట, కామారం తదితర గ్రామాలలో గ్రామ సర్పంచులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమక్షంలో నూతన గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మాదాసి శ్రీధర్ మాట్లాడుతూ మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ కాలం గడుపుతున్న బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పే బాధ్యత యువతపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని గమనించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవూరి జలంధర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పర్వతగిరి మహేశ్వరి రాజు, సొసైటీ చైర్మన్ ఎగితే లింగయ్య, ఆత్మకూరు మండల యూత్ అధ్యక్షుడు తనుగుల సందీప్, గఫూర్, మౌలా, రాజేందర్, రమేష్, ఆత్మకూరు గ్రామ అధ్యక్షులు తాళ్ల కిరణ్, నీరుకుళ్ళ అధ్యక్షుడు అర్షం కుమారస్వామి, ఎలగొండ లింగమూర్తి, పెంచికలపేట అధ్యక్షుడు మంగరాజు, సీనియర్ నాయకులు పరికరాల వాసు, డైరెక్టర్లు వెల్దే వెంకటేశ్వర్లు, రవి, సోషల్ మీడియా మండల ఇంచార్జీ ఉడత రాజేందర్, ఉడుత మహేందర్, నీలం రాజు, కుమారస్వామి, యూత్ నాయకులు పిట్టల రాజకుమార్, కరీం తదితరులు పాల్గొన్నారు.
