(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
- ఆత్మకూరు మండలం లో బ్యాటరీ లను దొంగిలిస్తున్న వ్యక్తి ని ని అరెస్ట్ చేశామని ఆత్మకూరు సి ఐ బాబులాల్ తెలిపారు. ఆత్మకూరు పోలీస్ ఇన్స్పెక్టర్ బాబులాల్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఆత్మకూర్ మండలంలోని గూడెపాడు జంక్షన్లోని రాజరాజేశ్వరి పంక్చర్ షాప్ వద్ద టిప్పర్ బ్యాటరీల దొంగను పట్టుకున్నా మని తెలిపారు . వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా కాశీబుగ్గ కు చెందిన పస్తం ఐలుకుమార్ 35 నుంచి రెండు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వాటి విలువ సుమారు రూ. 20 వేలు ఉంటుందని తెలిపారు.,సదరు నిందితుడు గత జూలై నెలలో గూడేపాడ్ హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద రెగొండ మండలానికి చెందిన మేకల భాస్కర్ రెడ్డికి చెందిన టిప్పర్ వాహనంలో రెండు బ్యాటరీలను దొంగిలించినట్లు తెలిపారు. నిందితుడిని, కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరణ్, మహిళా కానిస్టేబుల్ ప్రవళిక, హోంగార్డు రామన్న పాల్గొన్నారు.
