Preloader
K.Ashok Reporter

(జై భారత్ వాయిస్, న్యూస్ , ఆత్మకూరు )

పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన సీనియర్ పి ఆర్ టి యు టి ఎస్ నాయకుడు జమాండ్ల అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అశోక్ ప్రస్తుతం వరంగల్ జిల్లా చేన్నారావుపేట మండలం కోనా పురం ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయులు గా పని చేస్తున్నారు.ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు జమాండ్ల అశోక్ ను రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.2002వ సంవత్సరంలో పీఆర్టీయూ లో క్రియాశీల సభ్యత్వం పొందిన నాటి నుండి అశోక్ వివిధ మండలాల్లో కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా సంఘానికి విశేష సేవలు అందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి మూడు పర్యాయాలు అధ్యక్షులుగా పనిచేసి ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు.ఈ సందర్భంగా జమాండ్ల అశోక్ మాట్లాడుతూ తనకు రాష్ట్ర కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు సుంకరి బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శి బట్టాపురం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఈదునూరి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నక్కిరెడ్డి మహేందర్, సురేందర్, వెంకన్నలకు ధన్యవాదాలు తెలిపారు.రాబోయే నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు సుంకరి బిక్షం గౌడ్ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Share this news as a Photo Card

27 October 2026

పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా జమాండ్ల అశోక్

www.jaibharatvoice.com