Preloader

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు బోర్డు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.గత 37 సంవత్సరాలుగా హైదరాబాద్ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంతో పాటు, మురుగునీటి నిర్వహణ సేవలను కల్పించడంలో HMWSSB కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. నగర అభివృద్ధి, ప్రజారోగ్యం, సమగ్ర ప్రగతికి బోర్డు అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. హైదరాబాద్ నగరం నిరంతరం విస్తరిస్తున్న నేపథ్యంలో నీటి భద్రతకు, విలువైన జల వనరుల సుస్థిర నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం, ఉత్పన్నమవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మంచినీటి వనరులను పరిరక్షించేందుకు, గృహావసరాలకు సంబంధం లేని ఇతర అవసరాల కోసం మంచినీటి వినియోగాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.ఈ రోజు నుంచి ‘డయల్ గ్రీన్ ట్యాంకర్ – గ్రీన్ ట్యాంకర్ ఆపరేషన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ, సుస్థిర నీటి నిర్వహణ దిశగా ఇది సరైన సమయంలో చేపట్టిన కీలకమైన కార్యక్రమమని అభివర్ణించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన HMWSSBకి అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు, వాణిజ్య సంస్థలు తమ తోటల పెంపకం, నిర్మాణ పనులు, పారిశ్రామిక అవసరాల కోసం శుద్ధి చేసిన మురుగునీటిని (Treated Wastewater) మరింత విస్తృతంగా వినియోగించాలని కోరారు. దీనివల్ల మంచినీటిపై ఆధారపడటం తగ్గడంతో పాటు, అత్యవసర గృహావసరాలకు మంచినీరు అందుబాటులో ఉండేలా చూడవచ్చని పేర్కొన్నారు.నీటి సంరక్షణను సమిష్టి బాధ్యతగా స్వీకరించాలని, సుస్థిరమైన, నీటి భద్రత కలిగిన హైదరాబాద్ నిర్మాణంలో భాగస్వాములై ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రజలకు, సంబంధిత భాగస్వాములందరికీ పిలుపునిచ్చారుకోర్ అర్బన్ రీజియన్ (CURE) ప్రజలకు సేవలందించే లక్ష్యంతో HMWSSB తన ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Share this news as a Photo Card

01 November 2026

‘డయల్ గ్రీన్ ట్యాంకర్ – గ్రీన్ ట్యాంకర్ ఆపరేషన్స్’

www.jaibharatvoice.com