Preloader
*ఆత్మకూరు ట్రాన్స్ కో ఏఈని ఘనంగా సన్మానించిన మండల శాఖ అధికారులు*

(జై భారత్ వాయిస్, న్యూస్ ఆత్మకూరు)
వినాయక నవరాత్రి ఉత్సవాలు, దేవీ నవరాత్రి, సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగల సందర్భంగా ఆత్మకూరు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా సరఫరా చేసినందుకు ఆత్మకూరు ట్రాన్స్ కో అసిస్టెంట్ ఇంజనీర్ సుదర్శన్ ను మండల అధికారులు తహసిల్దార్ జగన్ మోహన్ రెడ్డి, ఎం డి ఓ శ్రీనివాస్ రెడ్డి లతో పాటు ఇతర అధికారులు సన్మానించారు.
సోమవారం జరిగిన ఆత్మకూరు మండల సర్వ సభ్య సమావేశంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అన్ని గ్రామాల సర్పంచులు కలిసి ఏఈ సుదర్శన్ ను శాలువాతో సన్మానించారు.
పండుగ రోజుల్లో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, ఏ ఈ ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారని సర్పంచులు తెలిపారు.
అనంతరం ఏఈ సుదర్శన్ మాట్లాడుతూ పండుగల నిర్వహణ విజయవంతం కావడానికి సహకరించిన విద్యుత్ సిబ్బందికి, అన్ని గ్రామాల సర్పంచులకు, విద్యుత్ వినియోగదారులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు, మండల అధికారులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

26 October 2026

ఆత్మకూరు ట్రాన్స్ కో ఏఈని ఘనంగా సన్మానించిన మండల శాఖ అధికారులు*

www.jaibharatvoice.com