Preloader
కటాక్షపూర్ లో నూతన గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు*

(జై భారత్ వాయిస్, న్యూస్ ఆత్మకూరు):

ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్, హౌస్ బుజుర్గ్ గ్రామాలలో నూతన గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆత్మకూరు మండల యూత్ అధ్యక్షుడు తనుగుల సందీప్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ లు, పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. కటాక్షపూర్ గ్రామ యూత్ అధ్యక్షుడిగా అజారుద్దీన్, హౌస్ బుజుర్గ్ గ్రామ యూత్ అధ్యక్షుడిగా సయ్యద్ ఇఫ్తాకర్ తో పాటు పూర్తి కమిటీని, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి యువ నాయకులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నుండి ఎలాంటి పిలుపు వచ్చినా విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు రేవూరి జలంధర్ రెడ్డి, కటాక్షపూర్ సర్పంచ్ ఎండి గఫూర్, హౌస్ బుజుర్గ్ సర్పంచ్ మౌల, ఇరు గ్రామాల పార్టీ అధ్యక్షులు మాలగాని మల్లయ్య, షేక్ సైదోలి, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

26 October 2026

కటాక్షపూర్ లో నూతన గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు

www.jaibharatvoice.com