జై భారత్ వాయిస్ న్యూస్: నాగర్‌కర్నూల్ జిల్లా
విజయ దశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్చకుల ఆశీర్వచనం స్వీకరించారు.ముందుగా నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, గ్రామస్థులు పెద్దఎత్తున హాజరై ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీగా శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
