జై భారత్ వాయిస్ న్యూస్ నాగర్కర్నూల్
నాగర్కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పిఎం-రాహత్ పథకం అమలును నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తనిఖీ చేశారు. రొడ్డు ప్రమాద బాధితులైన సత్యం, జబ్బర్ ఖాన్ తో మాట్లాడి, వారి ఆరోగ్యం చికిత్స గురించి ఆయన ఆరా తీశారు.ప్రమాద బాదితుల పట్ల నిర్లక్ష్యం లేకుండా తక్షణ. నాణ్యమైన వైద్య సంరక్షణ అందించేలా చూడాలని వైద్యులను ఆదేశించారు.ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు జరిగేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు.పిఎం-రాహత్ పథకం కింద ప్రమాద బాధితులు ఒక లక్షయాబై వేల వరకు నగదు రహిత చికిత్సకు అర్హులు, ఎంపిక చేసిన ఆసుపత్రులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అదనపు సహాయం కూడా అందించబడుతుందని తెలిపారు.ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి పోలీసు, వైద్య శాఖలు సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
