Preloader
( జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్‌ రాజీనామా చేయాలని పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్‌ అధ్యక్షుడు ఏరుకొండ రవీందర్‌ గౌడ్ డిమాండ్‌ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో హనుమకొండ జిల్లా సేవాదల్ అధ్యక్షుడు బొచ్చు చందర్ తోపాటు ఆయన పాల్గొని దీక్ష చేపట్టారు. రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకుని ఓట్ల అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థను కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులంతా ఉద్యమించాలని రవీందర్‌ గౌడ్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లెల్ల కృష్ణమూర్తి, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పల్లె రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

05 October 2026

ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్నారు

www.jaibharatvoice.com