ఆత్మకూరు మండలంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి మంగళ వారం పరామర్శించారు.
మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పెంచికల పేట లో సోమవారం కంద కట్ల మోహన్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబాలతో పాటు నిరుపేద కుటుంబాల కష్టసుఖాల్లో తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మండలంలోని ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రేవూరి జలంధర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, సర్పంచులు, వార్డు సభ్యులు, మండల సమన్వయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
