Preloader
జై భారత్ వాయిస్ న్యూస్ ములుగు: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడెం గ్రామానికి చెందిన కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి ములుగు జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రెడ్డి జాగృతి ముఖ్య నాయకుల సమావేశంలో ములుగుజిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షుడిగా కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రెడ్డి జాగృతి నాయకులు బుట్టెంగారి మాధవ్ రెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందుకున్నారు.కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ని హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డిని పైడాకుల అశోక్  ఆత్మీయంగా అభినందిస్తూ శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పైడాకుల అశోక్  మాట్లాడుతూ, శ్రీనివాస్ రెడ్డికి అప్పగించిన బాధ్యతలనుసమర్థవంతంగా నిర్వహిస్తూ రెడ్డి జాగృతి బలోపేతానికి, సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ములుగు జిల్లాలో రెడ్డి జాగృతి మరింత బలోపేతం కావాలని, అన్ని వర్గాలను కలుపుకొని సామాజిక అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రెడ్డి జాగృతి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో రెడ్డి జాగృతి అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్రంలోని రెడ్డి జాగృతి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడెబోయిన అనిల్ యాదవ్, బొబ్బ సత్తిరెడ్డి, బొబ్బ మధుసూదన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

04 October 2026

ములుగు జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షుడిగా కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి

www.jaibharatvoice.com