(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ) హనుమకొండ లోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం , యాంటీ డ్రగ్ కమిటీ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కళాజాత బృందం సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, బెట్టింగ్ యాప్లో జోలికి వెళ్లకూడదని తెలియజేశారు .కళాజాత బృందం అనేక పాటల ద్వారా రోడ్డు భద్రత ,సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో మోసాలు, గతంలో జరిగిన అనేక సంఘటనలు వివరించి విద్యార్థినీ. విద్యార్థులను చైతన్యవంతం చేశారు. సైబర్ నేరాల విషయంలో 1930కు కాల్ చేయాలని,గోల్డెన్ అవర్ అనేది నేరపు సొమ్ము రికవరీకి అత్యంతముఖ్యమని, 112కు కూడా కాల్ చేయవచ్చునని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జాతీయ సేవా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ గంగిశెట్టి శ్రీనివాస్ , డాక్టర్ బి సీతారాం, డాక్టర్ గన్సింగ్ ,యాంటీ డ్రగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శశికాంత్, ఐసీసీ కన్వీనర్ ప్రొఫెసర్ సమత, స్థానిక పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సాయి దివ్య, ఏఎస్ఐ నాగమణి కళాజాత బృందం సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.