(జై భారత్ వాయిస్ న్యూస్ కరీంనగర్)
కరీంనగర్ – వరంగల్ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఆర్టీసీ సరికొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికులు వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా నేటి నుంచి నాన్-స్టాప్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది.
కరీంనగర్ డిపోకు చెందిన నాలుగు అధునాతన విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సులకు డీలక్స్ బోర్డులు ఏర్పాటు చేసి నాన్-స్టాప్ గా నడుపుతున్నారు. నూతన బైపాస్ రోడ్డు నాలుగు లైన్ ల మార్గంలో ఈ సర్వీసులు ప్రయాణిస్థాయి. శంకరపట్నం (కేశవపట్నం), హుజురాబాద్, ఎల్కతుర్తి, హసన్ పర్తి తదితర ప్రాంతాల్లో ఎక్కడా ఆగవు. పట్టణాలు, మండల కేంద్రాలను తాకకుండా బస్సులు నేరుగా బైపాస్ మీదుగానే గమ్యానికి చేరుకుంటాయి. నూతనంగా అందుబాటులోకి వచ్చిన రహదారి మీదుగా ఈ సర్వీసులు పరుగులు తీయనున్నాయి. డీలక్స్ కేటగిరీ లో ప్రయాణం చేస్తారు.ప్రభుత్వం పట్టిన మహా లక్ష్మీ పథకం అంటే మహిళల ఉచిత ప్రయాణం ఉండదు.
