Preloader

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
జపాన్‌లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026లో మహిళల 400 మీటర్ల (T20) రేసును 56.36 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించి, స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తి జీవంజికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
దీప్తి సాధించిన ఈ చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో పారా అథ్లెట్లకు, యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని దీప్తి నిరూపించారని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పతకాలు సాధించి, తెలంగాణ, భారతదేశ కీర్తిప్రతిష్ఠలను అంతర్జాతీయ వేదికలపై చాటాలని ఆకాంక్షించారు.

Share this news as a Photo Card

20 October 2026

స్వర్ణ పతకం సాధించినదీప్తి జీవంజికి సిఎం రేవంత్ రెడ్డి అభినందనలు

www.jaibharatvoice.com