Preloader
ఆత్మకూరు లో బతుకమ్మ సంబరాలు

-పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)

ఆత్మకూరు మండల కేంద్రంలో, గూడెపాడ్ గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ఈ వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకోవాలలని చెప్పారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఏర్పాటు చేసి, సంప్రదాయ పాటలు పాడుతూ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలతో ఆత్మకూరు మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది..ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి ప్రజలకు, మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేవూరి రణధీర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చిదిరాల శ్రీనివాస్ రెడ్డి, ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షులు రేవూరి జలంధర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, మండల ప్రధాన కార్యదర్శి గుండె బోయిన శ్యామ్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు రేవూరి జైపాల్ రెడ్డి, ఆత్మకూరు సర్పంచులు పర్వతగిరి మహేశ్వరి రాజు, గుడెప్పాడు సర్పంచ్ పరికి రమేష్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్ల కిరణ్, ఉపాధ్యక్షుడు గంగినేని సతీష్ , పీ ఏ సి ఎస్ మాజీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ ,స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

19 October 2026

ఆత్మకూరు లో బతుకమ్మ సంబరాలు

www.jaibharatvoice.com