Preloader
సద్దుల పండుగ దసరా సందర్భంగా శ్రీ చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు

(జై భారత్ వాయిస్ న్యూస్ – ఆత్మకూరు)

ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామ పరిసరాల్లో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సద్దుల పండుగ ,దసరా సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామస్తులను చల్లగా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. ఆలయ పూజారి వడ్డేవరం వేణు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెంచికల్ పేట సొసైటీ మాజీ చైర్మన్ కడారి రఘునాథరావు, చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ తాటిపర్తి మోహనరావు, శ్రీ సిద్ది లింగేశ్వర స్వామి నిర్మాణ కమిటీ చైర్మన్ వెన్నపురెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మనగాని శంకర్, కమిటీ సభ్యులు పిట్టల ప్రభాకర్, అంకతి రాజు తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

17 October 2026

సద్దుల పండుగ దసరా సందర్భంగా శ్రీ చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు

www.jaibharatvoice.com