జై భారత్ వాయిస్ న్యూస్ తూప్రాన్: తూప్రాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకట్ స్వామి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ ఉమ్మన్న భాస్కర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నూతన పాలకవర్గం సమన్వయంతో పనిచేసి రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే అందరి లక్ష్యమని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. ఈ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి, తూప్రాన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నర్సింగా రావు, మనోహరాబాద్ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు, సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
