Preloader
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):

ఆత్మకూరు మండల కేంద్రంలోని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వమంగళ స్వరూపిణిగా, భక్తుల కోరికలు తీర్చే జగన్మాతగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పురోహితులు రాంపెల్లి పవన్ కుమార్ ఆచార్య మంత్రోచ్చారణల నడుమ , భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పుష్పాలంకరణ చేసి, ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గామాతను దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, లోకమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు.

*వైభవంగా అమ్మవారి పల్లకీ సేవ*

సాయంత్రం ఆత్మకూరు మండల కేంద్రంలో దుర్గామాత పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, భక్తుల నామస్మరణల నడుమ అమ్మవారి పల్లకీ సేవ సాగింది. అమ్మవారిని పల్లకీలో దర్శించుకుంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు సమర్పించారు. ఆత్మకూరు ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారగా, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో , వెలిదే కపిల్, కొంపల్లి రవీందర్, మార్త రంజిత్ కుమార్, కందగట్ల విజయకుమార్, కొంపల్లి మణికుమార్, రాజమౌళి, కృష్ణమూర్తి, రాజు, జగన్నాథం, సుమంత్ తేజతో పాటు మహిళా భక్తులు, స్థానిక భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this news as a Photo Card

16 October 2026

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత

www.jaibharatvoice.com