Preloader

జై భారత్ వాయిస్ న్యూస్ తిరుమల
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి సమిష్టి కృషితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు 8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకున్నారని చెప్పారు శ్రీవారి
హుండీ కానుకలు రూ.28.94 కోట్లు ఆదాయం 33 లక్షల లడ్డూల విక్రయం జరిగినట్లు తెలిపారు
21.84 లక్షల భక్తులకుఅన్నప్రసాదాల పంపిణీ 2.04 లక్షల మంది తలనీలాలు భక్తులు సమర్పించారు
వాహనసేవలకు ముందు ఇప్పటివరకు లేనివిధంగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు చెందిన సుమారు 7,871 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు.
గరుడసేవ రోజున 14 రాష్ట్రాల నుంచి 32 కళాబృందాలకు చెందిన 916 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారుబ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో సుమారు 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించి పుష్పాలంకరణ చేపట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 3,000 మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. గరుడసేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు సేవలందించేందుకు 4,000 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారని తెలిపారు

Share this news as a Photo Card

23 September 2026

సమిష్టి కృషితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం : టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు

www.jaibharatvoice.com