ఉయ్యూరు పట్టణంలో మంగళవారం RMP / PMPWA ఫోరం ఆధ్వర్యంలో నూతన జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం, మహాసభ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ .గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న RMP డాక్టర్ల సేవలు ఎంతో అభినందనీయమనీ, గ్రామీణ ప్రజల గుండె చప్పుడు rmp డాక్టర్లు అని, RMP డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తాను అని రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో RMP సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, ఉయ్యూరు పట్టణానికి చెందిన ప్రముఖులు, పెద్ద సంఖ్యలో RMP డాక్టర్లు పాల్గొన్నారు.