జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా, జనసేన పార్టీ శ్రేణుల నుండి సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటీతో సమన్వయం చేయడంతో పాటు, సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి నివేదించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక సమన్వయ కమిటీని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ కమిటీలో APMSIDC చైర్మన్ శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్ సభ్యులుగా ఉండనున్నారు.ఈ కమిటీ ఇప్పటికే పనిచేస్తున్న 14 మంది సభ్యుల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని సేకరించి, అధ్యయనం చేసి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి నివేదించనుంది. వీరు అందించిన నివేదికల ఆధారంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కమిటీ సభ్యులతో ప్రతిరోజూ సమీక్ష నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే గతంలో నియమించిన 14 మంది సభ్యుల కమిటీలో కొన్ని మార్పులు చేయాలని అధ్యకుల వారు సూచించారు.
#APLocalBodyElections
