Reporter:K.Ashok
(జై భారత్ వాయిస్, న్యూస్ ఆత్మకూరు)
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
శుక్రవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. 53 మందికి రూ.53 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 221 మందికి రూ.77.35 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఇప్పటివరకు నియోజకవర్గంలో 6841 మందికి రూ.47.94 కోట్ల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాపురం రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవూరి జలంధర్ రెడ్డి, సర్పంచులు ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరుల తో పాటు ఆత్మకూరు దామెర నడికుడ, గిసుగొండ, సంగెం తదితర మండలాల ప్రజలు పాల్గొన్నారు.
8
