Reporter:K.Ashok
(జై భారత్ వాయిస్, న్యూస్ ఆత్మకూరు )
ఆత్మకూరు మండలం హౌస్ బుజుర్గ్ గ్రామానికి చెందిన గోపురబోయిన రవి ఇంట్లో గతంలో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
శుక్రవారం నీరుకుళ్ల క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై తిరుపతి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న తొర్రూరు మండలం సోమారం తండాకు చెందిన బానోత్ నవీన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం అంగీకరించినట్లు
సీఐ జి. బాబులాల్ తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి అర తులం బంగారం, 17 తులాల వెండి, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం నిందితుడిని పరకాల కోర్టుకు తరలించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ రమేష్ పాల్గొన్నారు.
