(జై భారత్ వాయిస్, ఆత్మకూరు): ఆత్మకూరు గ్రామపంచాయతీకి చెందిన చైతన్య రథం, వైకుంఠ రథం నిర్వహణ కోసం గ్రామానికి చెందిన కీ.శే. తోట మల్లయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు తోట రఘు రూ. లక్ష విరాళాన్ని సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజుకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మహేశ్వరి మాట్లాడుతూ ప్రజాహిత సేవల కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళం ఇవ్వడం అభినందనీయమని, ఈ నిధులు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపి రఘుకు కృతజ్ఞతలు తెలిపారు.
