Reporter: K.Ashok
(జై భారత్ వాయిస్, న్యూస్ ఆత్మకూరు)
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడు గ్రామంలో పరకాల డివిజన్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఎల్‌నినో నేపథ్యంలో ఉద్యాన పంటల యాజమాన్యంపై గురువారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ లో
జిల్లా ఉద్యాన అధికారి పి. కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల వల్ల మామిడి, ఆయిల్ పామ్, అరటి, మిరప పంటలకు నష్టం జరగకుండా డ్రిప్, మల్చింగ్, సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు.
జె వి ఆర్ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. ఏ. ప్రశాంత్ మాట్లాడుతూ నేల పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులు వాడాలని, నీటిని పొదుపుగా వాడాలని తెలిపారు.
అనంతరం అధికారులు ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలుగా సాగు చేస్తున్న లిల్లీ, అరటిని పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల డివిజన్ ఉద్యాన వన శాఖ అధికారి ఏ .సునీల్ కుమార్ అక్కంపేట సర్పంచ్ ముద్దం సాంబయ్య, అగ్రహంపహాడ్ సర్పంచ్ గంగుల మహేందర్, సీతారాంపూర్ సర్పంచ్ పెండ్లి రాజు, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవళిక, ఉద్యాన విస్తరణ అధికారి దేవేందర్, ఆయిల్‌పామ్ ఏరియా మేనేజర్ ప్రవీణ్ కుమార్, అరుణ్, రంజిత్ రైతులు పెండ్లి శంకర్, రాదరపు రాజు, యశాల రవీందర్, సంజీవ రెడ్డి, అనంత రెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.
