Preloader
దశ తిరగనున్న ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేట!
-రూ.10 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )(Reporter : K. Ashok):

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్వగ్రామం అక్కంపేటకు మహర్దశ పట్టనుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోని ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జయశంకర్ స్వగ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 10 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ బుధవారం శంకుస్థాపన చేశారు.
గ్రామంలో పర్యటించిన కలెక్టర్, ముందుగా బీవీజీ రామ్ (BVG RAM) పథకం కింద నిర్మించనున్న కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్ పనులను ప్రారంభించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
తదుపరి గ్రామంలోని పీఎం శ్రీ పథకం కింద ఉన్న ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు అన్ని సామర్థ్యాలు అందేలా బోధించాలని ఉపాధ్యాయులను కోరారు. మధ్యాహ్న భోజనం ను తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దం సాంబయ్య, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంఈవో విజయ్ కుమార్, వ్యవసాయాధికారి యాదగిరి, పీఆర్ ఏఈ బాబురావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రంజిత్, ఎంపీఈవో రాజిరెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

05 November 2026

దశ తిరగనున్న ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేట!

www.jaibharatvoice.com