Preloader

జర్నలిస్టులు సమాజంలో జరిగే సంఘటనలు, వాస్తవాలు, ప్రజా సమస్యలను సేకరించి, ధ్రువీకరించి ప్రజలకు అందించే బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నల్లాల వినయ్ కుమార్ పేర్కొన్నారు.“కత్తి కన్నా కలం గొప్పది” అనే మాటకు పాత్రికేయులే నిదర్శనమని అన్నారు. రోజువారీ వార్తల ద్వారా ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతూ, ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు.ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ రాత్రింబవళ్లు శ్రమించే పాత్రికేయులు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో కీలకమని తెలిపారు. జర్నలిస్టులపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, అలాంటి ఘటనలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నల్లాల వినయ్ కుమార్ కోరారు.

Share this news as a Photo Card

03 November 2026

సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకం: నల్లాల వినయ్ కుమార్

www.jaibharatvoice.com