Preloader

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
.హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి నవంబర్ 3వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు.కళాశాలలో నిర్వహిస్తున్న పీజీ కోర్సుల్లో ఎం.ఏ. హిందీలో 23 సీట్లు, ఎం.హెచ్‌.ఆర్‌.ఎం.లో 21 సీట్లు, ఎం.కామ్‌లో 39 సీట్లు, ఎం.ఎస్సీ వృక్షశాస్త్రంలో 10 సీట్లు, ఎం.ఎస్సీ రసాయన శాస్త్రంలో 22 సీట్లు, ఎం.ఎస్సీ కంప్యూటర్ సైన్స్‌లో 39 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. మొత్తం ఆరు కోర్సుల్లో 154 సీట్లు భర్తీ చేయాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు.పీజీ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులతో పాటు, ప్రవేశ పరీక్ష రాయని అభ్యర్థులు కూడా అర్హతలను అనుసరించి స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావచ్చని ప్రిన్సిపల్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నవంబర్ 3వ తేదీలోగా కళాశాలను సంప్రదించి, ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలు పొందాలని ఆమె సూచించారు. పీజీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రొఫెసర్ సుంకరి జ్యోతి కోరారు.

Share this news as a Photo Card

29 October 2026

ఆర్ట్స్ కళాశాలలో పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు!

www.jaibharatvoice.com