Preloader

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:   గ్రేటర్ వరంగల్ నగరంలోని బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఆంగ్ల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కేడల కరుణశ్రీ  ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం కమ్యూనికేషన్స్ స్కిల్స్ పుస్తకం రచించిన  “*Engineering Communication and Language Skills” పుస్తకాన్ని వాగ్దేవి కళాశాలల చైర్మన్  దేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు.ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పుస్తకాన్ని రచించారు. విద్యార్థులు ఆంగ్లంలో సమర్థవంతంగా మాట్లాడటం, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడం, గ్రూప్ డిస్కషన్స్, ఉద్యోగ ఇంటర్వ్యూలు, ప్రెజెంటేషన్లు తదితర వృత్తిపరమైన అవసరాలకు తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడు తుందని,ఈ సందర్భంగా  కరుణశ్రీని చైర్మన్  దేవేందర్ రెడ్డి అభినందించారు. అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే విద్యారంగానికి ఉపయోగపడే పుస్తకాన్ని రచించడం ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విద్యా, పరిశోధనా రంగాలకు సంబంధించిన రచనలు చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో  కరుణశ్రీ ,టిఎన్జీఓస్ వరంగల్ నగర అధ్యక్షుడు శంకేసి రాజేష్, ఖిలా వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కేడల జనార్ధన్, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ,  సమక్ష్యంలో.పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం తనకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని కరుణశ్రీ పేర్కొన్నారు.ఈ పుస్తకం Amazon, Flipkart ఆన్‌లైన్ వేదికల్లో అందుబాటులో ఉందని, ఇంజినీరింగ్ విద్యార్థుల భాషా నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగావకాశాలకు అవసరమైన కమ్యూనికేషన్ సామర్థ్యాల పెంపునకు ఈ పుస్తకం తోడ్పడుతుందని  ఆశాభావం వ్యక్తంచేశారు.

Share this news as a Photo Card

29 October 2026

ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ స్కిల్స్ పుస్తకం ఆవిష్కరణ

www.jaibharatvoice.com