Preloader


(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):
దశాబ్దాలు గడుస్తున్నా ఆత్మకూరు మండల కేంద్రంలోనీ బస్ స్టేషన్ అభివృద్ధి కావడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. వాన చినుకు పడితే చిత్తరువే అన్న చందాన తయారు అయినట్లు ఉందని ప్రయాణికులు ఆరోపించారు. ప్రాంగణం అంతా బురదమయమై ఆర్టీసీ బస్సులు బస్టాండులోనికి రావడానికి పోవడానికి ఇబ్బంది ఎదురవుతున్నది. వాన పడితే నీళ్ల మడుగులు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు దీనితో బస్ స్టేషన్ లో ప్రయాణికులు ఉండలేకపోతున్నారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆయాంలో బస్ స్టేషన్ నిర్మాణం జరిగింది అప్పటినుండి ఇప్పటివరకు ఏమంతా అభివృద్ధి లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ బస్ స్టేషన్ను అభివృద్ధి చేయాలని పలుమార్లు జిల్లా ఆర్టిసి ఉన్నతాధికారులకు వినతి చేసిన కూడా అభివృద్ధి కావడం లేదని ఆరోపించారు. శాయంపేట ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆత్మకూరు మండల కేంద్రానికి వచ్చి ప్రయాణిస్తారు.ఎక్స్ ప్రెస్ బస్సు స్టేజి కావడంతో ఇక్కడి నుంచి హనుమకొండ హైదరాబాదు లాంటి పట్టణాలకు తరలి వెళ్తారు. అలాగే హనుమకొండ నుంచి ఆత్మకూరు మండలం మీదుగా ఎటురూనాగారం మంగపేట మణుగూరు భూపాలపట్నం, భద్రాచలం తదితర ప్రాంతాలకు వందలాది బస్సులు ఈ రహదారి పై నుంచి ప్రయాణిస్తూ ఉంటాయి. మేడారం జాతరకు ప్రతి ఏటా వెళ్లడానికి కూడా ఇక్కడ ఆర్టీసీ అధికారులు ఆ లైటింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తారు బస్సు స్టేషన్ ఆవరణలో సిమెంట్ కాంక్రీట్ చేసినట్లయితే నీరు నిలువక ఇబ్బందులు నివారించగలుగుతారని మండల ప్రజలు వివరించారు ఇప్పటికైనా ఆత్మకూరు బస్ స్టేషన్ను అభివృద్ధి చేయాలని మండల ప్రజలు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు

Share this news as a Photo Card

24 September 2026

చినుకు పడితే చిత్తరువే-అభివృద్ధికి నోచుకోని ఆత్మకూరు బస్ స్టేషన్

www.jaibharatvoice.com