-గ్రామాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు
-ఆత్మకూరు సీఐ బాబూలాల్..
- (జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) :
ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో దసరా ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, జరుపుకోవాలని ఆత్మకూరు సీఐ బాబూలాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పోలీసు స్టేషన్ లో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.
దసరా పండుగ సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండుగ వేడుకల సమయంలో ప్రజలు సంయమనం పాటిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి దసరా ఉత్సవాలను శాంతి యుతంగా జరుపుకోవాలని సీఐ బాబూలాల్ కోరారు.
