Preloader
  • *ఆత్మకూరులో రావణాసుర వధకు భారీ ఏర్పాట్లు*

    *(జై భారత్ వాయిస్ న్యూస్ -ఆత్మకూరు):*

    హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని పోచమ్మ సెంటర్ సమీపంలో రావణాసుర వధ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి-రాజు తెలిపారు.
    ఆదివారం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… దాదాపు పది ఎకరాల స్థలాన్ని చదును చేసి, స్టేజి, ఇంకా రావణాసుర వధకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గత 25 సంవత్సరాల క్రితం గ్రామంలో రావణాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారని, ఆ తర్వాత మళ్లీ చేపట్టలేదని గుర్తు చేశారు. ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా గ్రామ ప్రజల్లో భక్తి, వినోదాన్ని కల్పించేందుకు మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తుల పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.
    రాత్రిపూట లైటింగ్, మైక్ తదితర ఏర్పాట్లు చే8స్తున్నామని, కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
    ఈ రావణాసుర వధ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మాజీ చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారని తెలిపారు.
    ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్ల కిరణ్ కుమార్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు గంగినేని సతీష్, వడ్డేపల్లి ప్రసాద్, గ్రామ పంచాయతీ సిబ్బంది రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

19 October 2026

ఆత్మకూరులో రావణాసుర వధకు భారీ ఏర్పాట్లు*

www.jaibharatvoice.com