Preloader
ఆత్మకూరు మండల ఎంఎస్ఎఫ్ కమిటీ ఎన్నికను విజయవంతం చేయాలి
-హనుమకొండ జిల్లా కో-ఇంచార్జ్ తడుగుల విజయ్
Reporter: K.Ashok

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్ఎఫ్ నూతన మండల కమిటీల ఎన్నికలో భాగంగా శుక్రవారం ఎంఆర్పీఎస్ ఆత్మకూరు కో-ఇంచార్జ్ ఆర్షం సుధాకర్ ఆధ్వర్యంలో శనివారం ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ జిల్లా కో-ఇంచార్జ్ లు తడుగుల విజయ్, బండారి సురేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను ఎంఎస్ఎఫ్ సంఘంలో పనిచేసే విధంగా ప్రతి గ్రామంలో విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి కమిటీలు వేయాలని సూచించారు. అదేవిధంగా ఈ నెల 10న జరిగే ఎంఎస్ఎఫ్ ఆత్మకూరు మండల కమిటీ ఎన్నిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడపాక రాజు, మండల ఇంచార్జ్ నద్దునూరి రఘు, ఆత్మకూరు కో-ఇంచార్జ్ ఆర్షం సుధాకర్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కుక్కమూడి కుమారస్వామి, ఆర్షం పవన్, మాదాసి అనిల్ , సంఘీ రాజు, మాసి శ్రావణ్, మాదాసి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

08 November 2026

ఆత్మకూరు మండల ఎంఎస్ఎఫ్ కమిటీ ఎన్నికను విజయవంతం చేయాలి

www.jaibharatvoice.com